పూర్తిగా కుదుటపడని లతా మంగేష్కర్ ఆరోగ్యం.. ఇంకా ఐసీయూలోనే
- ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగించాల్సిన కండీషన్
- వేచి చూడాలంటున్న డాక్టర్ ప్రతీత్ సందాని
- ఆమె కోలుకోవాలని ప్రార్థిద్దామంటూ పిలుపు
లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని వేడుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందాని తాజాగా పిలుపునిచ్చారు. ‘‘ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే ఆమె ఉన్నారు. మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఏం చెప్పినా కానీ అది తొందరపాటే అవుతుంది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆమె ఆసుపత్రిలోనే మరో 10 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది’’అని ప్రతీత్ సందాని పేర్కొన్నారు.
లతా మంగేష్కర్ సోదరి ఆశాభోంస్లే సైతం స్పందించారు. కరోనా పాజిటివ్ కావడంతో సోదరిని చూసేందుకు అనుమతించడం లేదని తెలిపారు. ‘‘ఒక్కసారి నేను ఆసుపత్రికి వెళ్లినా కానీ కాంపౌండ్ లోకి అనుమతించలేదు. కానీ దీదీ పరిస్థితి మెరుగుపడుతోంది’’అని భోంస్లే తెలిపారు.