YSRCP: మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్

Minister Avanthi tests positive for corona
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అనే విషయం తెలియగానే ఆయన హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని మంత్రి సూచించారు.

అలాగే, తనను కలుసుకోవడానికి ఇంటి వద్దకు ఎవరూ రావద్దని మంత్రి కోరారు. అవసరమైతే ఫోన్ ద్వారా సంప్రదించాలని చెప్పారు. మరోవైపు వారం క్రితమే ఆయన రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఫస్ట్ వేస్ సమయంలో కూడా ఆయనకు కరోనా సోకింది.

ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. కొడాలి నాని, వంగవీటి రాధా తదితర నేతలకు ఇటీవలే కరోనా సోకింది.
Go Back to Shorts
YSRCP
Corona Virus
Vellampalli Srinivasa Rao

More Telugu News