సల్మాన్ ఖాన్ తో డేటింగ్ వార్తలపై స్పందించిన అమెరికా నటి సమంత
- ప్రజలు లేని దాని గురించి కూడా చెప్పగలరు
- ఈ వార్తలు ఎలా వచ్చాయో నాకు తెలియదు
- సల్మాన్ మంచి వ్యక్తి
‘‘ప్రజలు చాలా మాట్లాడుతుంటారు. లేని దాని గురించి చాలానే చెప్పగలరు. నేను సల్మాన్ ఖాన్ ను కలుసుకున్నాను. ఆయన మంచి వ్యక్తి. చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. ప్రజలకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను కలవడం అంటే.. హృతిక్ రోషన్ ను కూడా కలుసుకున్నాను. కానీ, నా గురించి, హృతిక్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు’’ అని స్పష్టం చేసింది. గత నెలలో హృతిక్ రోషన్ తో తీసుకున్న సెల్ఫీని సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకోవడం తెలిసిందే.