'పాకిస్థాన్ సూపర్ లీగ్'కు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు అనుమతి నిరాకరణ!
- త్వరలో పలు మ్యాచులు ఉన్నాయి
- న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో ఆడాల్సి ఉంది
- అందుకే అనుమతి నిరాకరణ
- స్పష్టం చేసిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు
క్రికెటర్లు ఎల్లప్పుడూ సొంత జట్టు సేవలకే ప్రాధాన్యం ఇవ్వాలని స్మిత్ చెప్పారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అంతేగాక, స్వదేశంలో బంగ్లాదేశ్తో కూడా ఆడాల్సి ఉంది. ఇక పాకిస్థాన్ సూపర్ లీగ్ ఈ నెల 24 నుంచే ప్రారంభం కానుంది. ఇందుకోసం పాక్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.