జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కించుకున్న కడప జిల్లా
- నేషనల్ వాటర్ అవార్డు-2020ని దక్కించుకున్న కడప జిల్లా
- నీటి సంరక్షణ కోసం చేసిన కృషికి అవార్డు
- 2018 నుంచి ఈ అవార్డులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం
నీటి సంరక్షణ కోసం కృషి చేసిన జిల్లాలు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, గృహ సంక్షేమ సంఘాలు, మతపరమైన సంఘాలు, పరిశ్రమలు, నీటి వినియోగ సంఘాలకు నేషనల్ వాటర్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తోంది. 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తోంది.