నేను ఎప్పుడూ నిన్ను నమ్ముతున్నాను: అల్లు అర్జున్ వ్యాఖ్యలకు సమంత రిప్లై
- పుష్ప సినిమాలోని 'ఊ అంటావా' పాటలో సమంత
- అందులో డ్యాన్స్ చేసినందుకు సామ్‌కు బన్నీ థ్యాంక్స్
- ఆమెను తాము నమ్మామని వ్యాఖ్య
- సమంత తమను ఎంత నమ్మిందోనని ప్రశ్న
- స్పందిస్తూ సమంత ట్విట్టర్ లో సమాధానం
ఈ ప్రత్యేక సాంగ్ చేసిన సమంత ఈ పాటను ఎంత నమ్మారో గానీ, తాము మాత్రం సమంతను బాగా నమ్ముతున్నామని చెప్పాడు. ఆమె కూడా తమను నమ్మిందని అన్నాడు. తమ మీద నమ్మకంతో చేశారు కదా? ఆ నమ్మకానికి థ్యాంక్స్ అని చెప్పాడు. ఆ పాట చిత్రీకరణ సమయంలో సెట్‌లో సమంతకు ఎన్ని అనుమానాలు వచ్చాయో తనకు తెలుసని బన్నీ అన్నాడు. అలా చేయడం తప్పా? కరెక్టేనా? అని ఆలోచించిందని తెలిపాడు.
అయితే, తనను నమ్మాలని తాను ఒక్క మాట చెప్పడంతో ఇంకో ప్రశ్న కూడా సమంత వేయలేదని అన్నాడు. అది తన గుండెను తాకిందని చెప్పాడు. తాము ఏది అడిగినా కూడా ఆలోచించకుండా సమంత చేసిందని తెలిపాడు. దీంతో తన మీద తనకు ఇంకా గౌరవం పెరిగిందని చెప్పాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ సాంగ్‌గా ఇది యూట్యూబ్‌లో నిలబడటం అంటే సాధారణ విషయం కాదని అల్లు అర్జున్ చెప్పాడు.
దీంతో అల్లు అర్జున్ తనపై చేసిన వ్యాఖ్యల వీడియోను సమంత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇకపై తాను ఎల్లప్పుడూ బన్నీని నమ్ముతానని పేర్కొంది. కాగా, ప్రస్తుతం సమంత వరుస సినిమాలను ప్రకటిస్తూ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసింది. తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమాలోనూ నటిస్తోంది. మరిన్ని సినిమాలూ ఆమె చేతిలో ఉన్నాయి.