Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఎన్టీఆర్ .. చరణ్ పవర్ఫుల్ పోస్టర్స్!

రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. జనవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ ముగ్గురూ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో తీరిక లేకుండా ఉన్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన టీమ్, నిన్న చెన్నైలోను ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపింది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ .. చరణ్ కి సంబంధించిన కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు.

పోలీస్ ఆఫీసర్ లుక్ తో చరణ్ .. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ప్రమోషన్స్ మొదలుపెట్టిన తరువాత బయటికి వచ్చిన వాటిలో ఇవి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ గా చెప్పుకోవచ్చు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటించారు..
Junior NTR
Ramcharan
Rajamouli
RRR Movie

More Telugu News