Salman Khan: సినీ హీరో సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము...ప్రమాదం లేదన్న వైద్యులు

snake bites saamn khan
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఓ పాము కాటేసింది. దీంతో ఆయ‌న‌కు ఆసుపత్రిలో చికిత్స అందింది. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫాంహౌస్‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌ను విషం లేని పాము కాటు వేసింది. దీంతో ఆయ‌న‌ను కమోతేలోని ఎంజీఎం ఆసుప‌త్రికి తీసుకెళ్లి సిబ్బంది చికిత్స అందించారు.

స‌ల్మాన్ ఖాన్‌ను పరీక్షించిన వైద్యులు ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి, ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి చేశారు. సల్మాన్ చేతిని పాము కాటు వేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా, స‌ల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్ 15’ తాజా ఎపిసోడ్ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది. ఇందులో ఆయ‌న‌ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో సంద‌డి చేయ‌నున్నాడు.
Go Back to Shorts
Salman Khan
Bollywood
snake

More Telugu News