bhahmaji: జ‌గ‌న్ స‌ర్.. అంద‌రికీ వ‌రాలు ఇస్తారు.. మాకు ఇవ్వ‌రా?: సినీ న‌టుడు బ్ర‌హ్మాజీ

andhariki varalu isthunnaru brahmaji tweet
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను ఆయ‌న ఈ సంద‌ర్భంగా రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది. ఈ ఫొటోల‌నే బ్ర‌హ్మాజీ పోస్ట్ చేశారు.

'సీఎం జ‌గ‌న్ స‌ర్.. అంద‌రికీ వ‌రాలు ఇస్తారు.. పాపం థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు, సినిమా వాళ్ల‌కి కూడా సాయం చేయండి. ఇట్లు మీ మీ నాన్న గారి అభిమాని' అంటూ బ్రహ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తూ రిప్లైలు ఇస్తున్నారు.

Go Back to Shorts
bhahmaji
Tollywood
Jagan
Andhra Pradesh

More Telugu News