రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందే: కొడాలి నాని

Kodali Nani comments on Amaravati
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందేనని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి అన్ని ప్రాంతాల వారిది అంటున్న కొందరు పెద్దలు అక్కడున్న పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు ఆయన గుడివాడలో జగనన్న గృహ హక్కు పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు రిజస్టర్ దస్తావేజులను అందించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, జాయింట్ కలెక్టర్, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Kodali Nani
YSRCP
Amaravati

More Telugu News