Kinjarapu Ram Mohan Naidu: రామ్మోహ‌న్ నాయుడి ఇంటి వ‌ద్ద ర‌క్త‌పింజ‌రి పాము.. బుస‌లు కొట్టిన వైనం

snake at ram mohan naidu home
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడి ఇంటి ఆవ‌ర‌ణ‌లో అత్యంత విష‌పూరిత ర‌క్త‌పింజ‌ర‌ పాము తిరుగుతూ అల‌జ‌డి రేపింది. శ్రీ‌కాకుళం న‌గ‌రంలోని ఆయ‌న ఇంటి వ‌ద్ద ఈ పాము చొర‌బ‌డ‌డంతో ఎంపీ నివాసంలోని సిబ్బంది దాన్ని గుర్తించారు. అది భ‌యంక‌రంగా బుస‌లు కొడుతూ ఉండ‌డంతో భ‌య‌ప‌డిపోయారు.

దీంతో గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు స‌మాచారం అందించ‌డంతో ఆ సిబ్బంది వెంట‌నే ఎంపీ ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్నారు. పామును ప‌ట్టుకుని తీసుకెళ్లారు. దీంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. దాన్ని అట‌వీ ప్రాంతంలో విడిచిపెట్టాలని ఓ అధికారి చేసిన సూచ‌న మేర‌కు పామును అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు.
Go Back to Shorts
Kinjarapu Ram Mohan Naidu
Telugudesam
Srikakulam District

More Telugu News