ఉత్కంఠను రేపుతున్న 'అంతఃపురం' ట్రైలర్
- రాశి ఖన్నా ప్రధాన పాత్రగా 'అంతఃపురం'
- దెయ్యం కాన్సెప్ట్ తో వస్తున్న మరో సినిమా
- 'అరణ్మనై 3' తమిళ చిత్రానికి ఇది డబ్బింగ్
- ఈ నెల 31వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. "ఈ అడవిలో రాణి దెయ్యంగా తిరుగుతోందని అందరూ అంటున్నారు విశాలమ్మా.. " అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ఆ గది తలుపులు తెరిచిన దగ్గర నుంచే ఇలా జరుగుతోంది .. ఇంతకు అసలు ఆ గదిలో ఏముందని?" వంటి డైలాగ్స్ మరింత కుతూహలాన్ని పెంచుతున్నాయి.
ఆర్య - రాశి ఖన్నా నాయకా నాయికలుగా నటించగా, కీలకమైన పాత్రను ఆండ్రియా పోషించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో సుందర్ .. యోగిబాబు .. సంపత్ రాజ్ కనిపించనున్నారు. ప్యాలెస్ లో దెయ్యం అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.