Tirumala: తిరుమలలో ఈ టికెట్ ధర రూ. 1.50 కోట్లు!

TTD Udayastama seva rate is 1 Cr
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉదయాస్తమ సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమ సేవా టికెట్ ధరను రూ. 1 కోటిగా నిర్ణయించారు. శుక్రవారం రోజున ఈ టికెట్ ధర రూ. 1.5 కోట్లుగా ఉంటుంది. టీటీడీ వద్ద 531 ఉదయాస్తమ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్ తో 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం భక్తులకు లభిస్తుంది.

ఉదయాస్తమ సేవ టికెట్ తీసుకున్న వారికి ఏడాదికి ఒక రోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ టికెట్ల వల్ల టీటీడీకి దాదాపు రూ. 600 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ సేవా టికెట్ల వల్ల వచ్చే ఆదాయాన్ని చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.
Go Back to Shorts
Tirumala
Udayastama seva
Ticket
Rate

More Telugu News