ఇంత‌కుముందు అలా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా ఉంది: ఫొటోలు పోస్ట్ చేసిన కేటీఆర్
Add ap7am to your home Screen

ఇంత‌కుముందు అలా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా ఉంది: ఫొటోలు పోస్ట్ చేసిన కేటీఆర్

Before  After pics of the 2BHK homes
  • హైద‌రాబాద్‌లోని బ‌న్సీలాల్ పేట‌లో డ‌బుల్ బెడ్రూం ఇళ్లు
  • నిన్న ప్రారంభించిన కేటీఆర్
  • మంత్రుల‌కు అభినంద‌న‌లు
హైద‌రాబాద్‌లోని బ‌న్సీలాల్ పేట‌లోని చాచా నెహ్రూ నగర్‌లో డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభించామ‌ని తెలుపుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ప‌లు ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ ప్రాంతం డ‌బుల్ బెడ్రూంలు క‌ట్ట‌క‌ముందు ఎలా ఉండేదో, కట్టాక ఇప్పుడు ఎలా ఉందో తెలుపుతూ ఆయ‌న అప్ప‌టి ఫొటోల‌తో పాటు తాజా ఫొటోలు పోస్ట్ చేశారు.
                
జీహెచ్ఎంసీ, మంత్రులు వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ల‌ను అభినందిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, బ‌న్సీలాల్ పేట‌లోని అక్రమ నిర్మాణాల‌ను తొల‌గించిన అధికారులు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టారు. నిన్న ఆ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

        
                
KTR
TRS
Telangana

More Telugu News