'హిట్ 2' నుంచి ఫస్టు గ్లింప్స్ రిలీజ్!
- విష్వక్సేన్ హీరోగా వచ్చిన 'హిట్'
- ఆ సినిమాకి సీక్వెల్ గా 'హిట్ 2'
- హీరోగా అడివి శేష్
- కథానాయికగా మీనాక్షి చౌదరి
ఈ రోజున అడివి శేష్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. ఈ సినిమాలో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఆయనకి సంబంధించిన యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలతో వదిలిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం సాగే అన్వేషణ .. ఆ నేపథ్యంలో అతనికి సహకరించే పోలీస్ డాగ్ .. కేసు విషయంలో చిక్కుముడులను ఎలా విప్పుకురావాలనే ఆలోచనలో పడటం .. తన అన్వేషణకి అడ్డుపడినవారికి పోలీస్ కోటింగ్ ఇవ్వడం ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి.