10 రోజులు ఎవరూ నవ్వకూడదంటూ నిషేధం విధించిన ఉత్తరకొరియా
- మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ వర్ధంతి నేపథ్యంలో ఆంక్షలు
- ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన శిక్షలే
- పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నార్త్ కొరియా
గతంలో ఈ సంతాప దినాల సమయంలో మద్యం సేవించిన వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని... వాళ్లు ఇంతవరకు మళ్లీ కనిపించలేదని ఓ వ్యక్తి తెలిపాడు. అంత్యక్రియలను కూడా నిర్వహించడానికి వీలుండదని, పుట్టినరోజులు కూడా ఎవరూ నిర్వహించుకోకూడదని చెప్పాడు. మరోవైపు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉత్తరకొరియా సిద్ధమవుతోంది. కిమ్ జాంగ్ ఇల్ జీవితానికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను చేపట్టబోతోంది.