gutta: ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన‌ వారిని సంఘ బహిష్కరణ చేయాలి: గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

gutta slams revant
షార్ట్స్‌లో చూడండి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్య‌లపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌ల్ల‌గొండ‌లోని త‌న నివాసం వ‌ద్ద ఆయ‌న ఈ రోజు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు వంటి వాటిలో దొరికిపోయిన‌ వారిని సంఘ బహిష్కరణ చేయాలన్నారు.

రేవంత్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యల ప‌ట్ల‌ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ‌ ఉద్యమ నాయకుడు, ప్ర‌త్యేక‌ రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్‌పై ఆయ‌న చేస్తోన్న వ్యాఖ్య‌లు స‌రికాద‌ని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి అన్నారు. బీజేపీపై కూడా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ రంగ‌ బ్యాంకులతో పాటు ఇత‌ర‌ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకు బీజేపీ కుట్ర ప‌న్నుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు.
Go Back to Shorts
gutta
TRS
Revanth Reddy

More Telugu News