తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసుల వెల్లడి

Four more Omicron variant positive cases identified in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో తాజాగా నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కి పెరిగింది. అటు కర్ణాటకలోనూ మరో 5 కేసులు వెలుగుచూశాయి. వీరందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారే కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటివరకు మహారాష్ట్రలో 32, రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 10, కర్ణాటకలో 8, తెలంగాణలో 7, కేరళలో 5, గుజరాత్ లో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1, చత్తీస్ గఢ్ లో 1, తమిళనాడులో 1 ఒమిక్రాన్ కేసును గుర్తించారు. ఈ క్రమంలో, దేశంలో కొత్త వేరియంట్ కారణంగా నమోదైన కేసుల సంఖ్య 87కి చేరింది.
Go Back to Shorts
Telangana
Omicron
Positive
New Variant
Corona Virus
India

More Telugu News