కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు!
- ఈ నెల 19 నుంచి కేసీఆర్ పర్యటన ప్రారంభం
- వనపర్తి జిల్లా నుంచి ప్రారంభంకానున్న కేసీఆర్ పర్యటన
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం
ఈ నెల 20న జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ జిల్లాలో కూడా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.