బిల్లు కట్టమంటే కట్టరా?.. ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ కట్ చేసిన అధికారులు
- రూ.కోటికి పైగా బిల్లుల పెండింగ్
- నోటీసులిచ్చినా పట్టించుకోని హెచ్ సీఏ
- గతంలో చౌర్యం కేసూ పెట్టిన విద్యుత్ శాఖ
వాస్తవానికి బిల్లు కట్టకుండా కరెంటు వాడుకుంటుండడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)పై గతంలో విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ చౌర్యం కేసు నమోదు చేశారు. దీనిపై హెచ్ సీఏ కోర్టుకు వెళ్లగా.. విద్యుత్ శాఖకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు చెప్పినా హెచ్ సీఏలో మార్పు రాలేదు. ఇటీవలే విద్యుత్ అధికారులు బకాయిల విషయంపై నోటీసులూ జారీ చేశారు. అయినా, చెల్లించకపోవడంతో అధికారులు కరెంట్ కట్ చేశారు.