తెలంగాణలో కొత్తగా 210 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 210 కరోనా కేసులు

Telangana Covid details
  • గత 24 గంటల్లో 40,997 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 87 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,833 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 40,997 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 210 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 87 కొత్త కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 21, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 213 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,688 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,70,846 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 3,833 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,009కి పెరిగింది.
Telangana
COVID19
Details
Today Cases

More Telugu News