మదనపల్లె మార్కెట్‌లో రికార్డు.. కిలో మునగకాయలు రూ. 600
- సైజును బట్టి కిలోకు 12 నుంచి 18 కాయలు
- ఒక్కో మునగకాయ ధర రూ. 30 పైనే
- వర్షాల వల్ల పంట దెబ్బతినడమే కారణమంటున్న వ్యాపారులు
మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని మునగచెట్లు వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా ఇక్కడ కిలో రూ. 80 నుంచి రూ. 150 మధ్య పలుకుతున్నాయి.