తెలంగాణలో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona report
  • గత 24 గంటల్లో 39,495 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,779 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 39,495 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 213 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 21, సంగారెడ్డి జిల్లాలో 20, కరీంనగర్ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 156 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,787 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,69,010 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,779 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,998కి పెరిగింది.
Telangana
Corona Virus
Media Report
Today Cases

More Telugu News