Balakrishna: ఇరగదీశావ్ బాబాయ్: కల్యాణ్ రామ్

  • ఈ నెల 2వ తేదీన విడుదలైన 'అఖండ'
  • తొలి ఆటతోనే హిట్ టాక్
  • ఓవర్సీస్ లోను అదే జోరు
  • బాలయ్యకి దక్కుతున్న ప్రశంసలు
Akhanda movie update

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఏ థియేటర్ దగ్గర చూసినా అభిమానుల సందడి కనిపిస్తోంది. ఓవర్సీస్ లోను అభిమానుల సందడి ఒక రేంజ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు చాలామంది బాలకృష్ణకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన నటన మరో స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. అదరగొట్టేశావ్ బాలా బాబాయ్ అంటూ ఎన్టీఆర్ స్పందిస్తే, 'ఇరగదీశావ్ బాబాయ్' అంటూ తాజాగా కల్యాణ్ రామ్ ట్వీట్ చేశాడు.

ఈ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేశాననీ .. బాలయ్య బాబాయ్ ఇరగదీశాడని అన్నాడు. ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ దక్కింది అంటూ, ఈ సినిమా టీమ్ కి అభినందనలు అందజేశాడు. ఇక కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బింబిసార' సిద్ధమవుతోంది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా కూడా అంచనాలు పెంచుతోంది.

More Telugu News