కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు నా అభినందనలు: చిరంజీవి
- 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ నిర్మించిన నిహారిక
- ఇటీవల రిలీజైన వెబ్ సిరీస్
- జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
- వెబ్ సిరీస్ వీక్షించిన చిరంజీవి
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ చూశానని, ఎంతో వినోదాత్మకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు, ఓసీఎఫ్ఎస్ బృందానికి అభినందనలు అంటూ ఓ ప్రకటన చేశారు. వెబ్ సిరీస్ నిర్మాణంలో తన తొలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా, జనరంజకంగా తీసి ప్రేక్షకులను మెప్పిస్తోందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో తను మరిన్ని చిత్రాలను నిర్మించాలని కోరుకుంటున్నానని తెలిపారు.