మళ్లీ ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కాసేపట్లో జగన్ వీడియో కాన్ఫరెన్స్
- ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమైన పలు జిల్లాలు
- తాజాగా మరోసారి విరుచుకుపడుతున్న భారీ వర్షాలు
- ఇప్పటికే కేంద్రాన్ని వెయ్యి కోట్ల ఆర్థిక సాయాన్ని కోరిన జగన్
మరోవైపు కాసేపట్లో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్షరెన్స్ నిర్వహించనున్నారు. కలెక్టర్లకు తగు సూచనలు చేయనున్నారు. మరోవైపు తుపాన్ వల్ల వాటిల్లిన నష్టంపై కేంద్రం బృందం ఓ అంచనాకు వచ్చింది. నాలుగు జిల్లాల్లో గత మూడు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించింది. సీఎం జగన్ తో కేంద్ర బృందం భేటీ కానుంది. ఇంకోవైపు తక్షణ సాయంగా వెయ్యి కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్రాన్ని జగన్ ఇప్పటికే కోరారు.