రోగికి చికిత్స చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు.. ఇద్దరూ మృతి
- కామారెడ్డి జిల్లాలో ఘటన
- గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తికి గుండెనొప్పి
- ఆసుపత్రికి వెళ్లిన బాధితుడు
- అతడికి వైద్యం చేస్తుండగా ఘటన
గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తి గుండెనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అతడికి చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యుడి పేరు లక్ష్మణ్ అని పోలీసులు తెలిపారు. గుండెపోటుకు గురైన వైద్యుడు లక్ష్మణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పేషెంట్‌ను కామారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్తోన్న సమయంలో మృతి చెందాడు.