Police: సినీ ప్ర‌ముఖుల‌ను మోసం చేసిన శిల్ప హైద‌రాబాదులో అరెస్టు

police arrest shilpa
షార్ట్స్‌లో చూడండి
హైద‌రాబాద్‌లో సినీ, వ్యాపార‌ ప్ర‌ముఖుల్ని మోసం చేసిన శిల్ప అనే మ‌హిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్ర‌ముఖుల‌ నుంచి మోసపూరితంగా డ‌బ్బులు వ‌సూలు చేసింద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమె పేజ్‌త్రీ పార్టీల‌తో సెల‌బ్రిటీల‌ను ఆక‌ర్షించినట్లు స‌మాచారం.

డ‌బ్బు ఇస్తే అధిక వ‌డ్డీ ఇస్తాన‌ని చెప్పి శిల్ప కోట్లాది రూపాయ‌లు వ‌సూలు చేసింది. స‌మాజంలో ప‌లుకుబ‌డి ఉన్న ప్ర‌ముఖుల పేర్లు చెప్పి ఆమె డ‌బ్బులు తీసుకుంది. చివ‌ర‌కు తిరిగి డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆమె చేస్తోన్న మోసాల‌ను గుర్తించిన కొంద‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆమెను అరెస్టు చేశారు.
Go Back to Shorts
Police
Hyderabad
Tollywood

More Telugu News