Andhra Pradesh: కడప చేరుకున్న చంద్రబాబు.. పోటెత్తి వచ్చిన టీడీపీ శ్రేణులు

Chandrababu Reaches Kadapa Humongous Welcome From TDP Workers
షార్ట్స్‌లో చూడండి
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప చేరుకున్నారు. ఇవాళ కడప జిల్లాలోని రాజంపేట, నందలూరు మండలాల్లో బాధితులను పరామర్శించనున్నారు. పులపతత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితుల గోడు తెలుసుకోనున్నారు.


అంతకుముందు కడప విమానాశ్రయం వద్ద చంద్రబాబుకు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీలో పరిణామాల తర్వాత తొలిసారి ఆయన ప్రజా క్షేత్రంలోకి వస్తుండడంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. విమానాశ్రయం ప్రాంగణం మొత్తం తెలుగు తమ్ముళ్లతో నిండిపోయింది. దారి పొడవునా చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయన ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. కాగా, చంద్రబాబు రేపు చిత్తూరు, ఎల్లుండి నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు.

Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Kadapa District

More Telugu News