నాగార్జున సినిమాలో 'జాతిరత్నాలు' భామ
- 'జాతిరత్నాలు'తో ఫరియాకు గుర్తింపు
- నాగార్జున 'బంగార్రాజు'లో అవకాశం
- స్పెషల్ సాంగులో మెరవనున్న ఫరియా
నాగార్జున హీరోగా గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ గా 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. నాగలక్ష్మి పాత్రలో తాజాగా విడుదలైన ఆమె గ్లామరస్ లుక్కుకి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.
ఇక ఈ సినిమాలో ఓ మాంచి ఐటం సాంగ్ ఉందట. ఇందుకోసం ఫరియా అబ్దుల్లాను తీసుకున్నట్టు తాజా సమాచారం. మామూలుగానే ఫరియాకు మంచి డ్యాన్సర్ గా పేరుంది. మరి ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగులో ఆమె డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడాలి!