Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవే ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి: జగన్

Jagan response on Municipal elections victory
  • మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ
  • దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఘన విజయాన్ని అందించాయన్న జగన్
  • గ్రామంతో పాటు నగరం కూడా ప్రభుత్వానికి అండగా నిలిచిందని వ్యాఖ్య
నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, కొన్ని నగర పంచాయతీలు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయని చెప్పారు. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిందని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
Jagan
YSRCP
Municipal Elections

More Telugu News