పోచంపల్లి గ్రామానికి ఐక్యరాజ్యసమితి విశిష్ట గుర్తింపు
- సిల్క్ సిటీగా పేరొందిన పోచంపల్లి
- ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు
- వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డుకు ఎంపిక
- డిసెంబరు 2న స్పెయిన్ లో అవార్డు ప్రదానం
వచ్చే నెల 2న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో జరిగే ఐరాస వరల్డ్ టూరిజం 24వ మహాసభల్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేయనున్నారు. భారత్ నుంచి ఈ అవార్డుకు మూడు గ్రామాలు రేసులో నిలిచాయి. అయితే సిల్క్ సిటీ పోచంపల్లి మిగతా గ్రామాలను వెనక్కి నెట్టి అరుదైన పురస్కారం సొంతం చేసుకుంది.