‘ఇఫి’లో ప్రసంగించాలంటూ సమంతకు ఆహ్వానం.. ఆ గౌరవాన్ని దక్కించుకున్న తొలి దక్షిణాది నటిగా సామ్
- ఈ నెల 28-30 మధ్య గోవాలో ఫిల్మ్ ఫెస్టివల్
- సామ్‌తోపాటు బాలీవుడ్ నటులు, దర్శకులకు కూడా ఆహ్వానం
- వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత నటించిన ‘శాకుంతలం’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమిళంలో నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క, ప్రముఖ నటి తాప్సి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న మరో సినిమాకు కూడా సమంత సైన్ చేసినట్టు తెలుస్తోంది.