Pushpaka Vimanam: వైజాగ్ లో ఈ నెల 7న గ్రాండ్ గా 'పుష్పక విమానం' ప్రీ రిలీజ్ ఈవెంట్

Pushpaka Vimanam pre release event will held at Vizag
షార్ట్స్‌లో చూడండి
యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, శాన్వి మేఘన, గీత్ సైనీ నటించిన చిత్రం 'పుష్పక విమానం'. దామోదర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో 'పుష్పక విమానం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న వైజాగ్ లో భారీ అభిమాన సందోహం నడుమ ప్రీ రిలీజ్ వేడుక జరపాలని చిత్రబృందం నిర్ణయించింది.

హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ కోసం ప్రమోషనల్ ఈవెంట్స్ ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నెల 10న మహబూబ్ నగర్ లోని తమ సొంత థియేటర్ ఏవీడీ సినిమాస్ లో 'పుష్పక విమానం' ప్రీమియర్స్ ప్రదర్శిస్తుండగా, ఈ షోకు విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. 'పుష్పక విమానం' థియేట్రికల్ ట్రైలర్ ను ఇటీవలే 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ ఆవిష్కరించడం తెలిసిందే. ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Go Back to Shorts
Pushpaka Vimanam
Pre Release Event
Vizag
Anand Devarakonda
Vijay Devarakonda
Tollywood

More Telugu News