కొందరు అధికారులు వైసీపీ తరఫున పనిచేస్తున్నారు: ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

TDP leaders complains to SEC
  • ఏపీలో మిగిలిన స్థానిక సంస్థలకు ఎన్నికలు
  • వైసీపీ నేతలపై టీడీపీ ఆగ్రహం
  • నామినేషన్లకు అడ్డుతగులుతున్నారన్న టీడీపీ నేతలు
  • వైసీపీ అనుకూల అధికారిని కుప్పంలో నియమించారని ఆరోపణ
ఏపీలో వివిధ కారణాలతో ఎన్నికలకు వెళ్లని స్థానిక సంస్థలకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే, తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

గుంటూరు జిల్లాలోని జంగమేశ్వరం, గురజాలలో వైసీపీ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు అశోక్ బాబు, జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కొందరు అధికారులు కూడా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని వారు తెలిపారు. వైసీపీ అనుకూల వ్యక్తిగా ముద్రపడిన అధికారిని కుప్పంలో నియమించారని తెలిపారు. ఈ మేరకు వారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నేడు ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేతలు... వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోవాలంటూ కార్యదర్శి కన్నబాబును కోరారు. 
Go Back to Shorts
TDP
YSRCP
Local Body Polls
SEC
Andhra Pradesh

More Telugu News