విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి చేసిన దుండగుడు.. వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి చేసిన దుండగుడు.. వీడియో ఇదిగో!

Attack on Vijay Sethupathi in Bengaluru airport
  • దాడి నిన్న రాత్రి జరిగినట్టు సమాచారం
  • సేతుపతి, ఆయన టీమ్ నడుస్తుండగా  వెనుక నుంచి దాడి
  • దుండగుడ్ని పట్టుకున్న సెక్యూరిటీ, పోలీసులు
ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో సేతుపతికి ఈ చేదు అనుభవం ఎదురైంది. నిన్న రాత్రి ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. సేతుపతి, ఆయన టీమ్ నడుస్తుండగా వెనుక నుంచి సదరు వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. వెంటనే సేతుపతి టీమ్, సెక్యూరిటీ, పోలీసులు దుండగుడ్ని పట్టుకున్నారు.

అయితే అతనిపై కేసు నమోదు చేయవద్దని సేతుపతి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో సేతుపతికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Vijay Sethupathi
Tollywood
Kollywood
Attack

More Telugu News