క‌బ‌డ్డీ.. క‌బ‌డ్డీ అంటూ హుషారుగా యువ‌కుల‌తో పోటీల్లో పాల్గొన్న రోజా.. ఔట్ చేయ‌లేక‌పోయిన భ‌ర్త సెల్వ‌మ‌ణి.. వీడియో వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క‌బ‌డ్డీ.. క‌బ‌డ్డీ అంటూ హుషారుగా యువ‌కుల‌తో పోటీల్లో పాల్గొన్న రోజా.. ఔట్ చేయ‌లేక‌పోయిన భ‌ర్త సెల్వ‌మ‌ణి.. వీడియో వైరల్

roja plays kabaddi
  • ఏపీలో నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీలు
  • అతిథిగా అక్క‌డ‌కు భ‌ర్త‌తో క‌లిసి రోజా
  • టాస్ వేసిన రోజా
  • కాసేపు క‌బ‌డ్డీ ఆడి అల‌రించిన రోజా దంప‌తులు
వైసీపీ ఎమ్మెల్యే రోజా త‌న భ‌ర్త‌, ప‌లువురు క్రీడాకారుల‌తో క‌లిసి క‌బ‌డ్డీ ఆడారు. ఆమెను ఔట్ చేయ‌డానికి భ‌ర్త సెల్వ‌మ‌ణి ప్ర‌య‌త్నించ‌గా ఆయ‌న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాలేక‌పోయాయి. ఆటవిడుపుతో రోజా అలరించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ఏపీలో నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీలు నిర్వ‌హిస్తున్నారు. అతిథిగా అక్క‌డ‌కు రోజా వెళ్లారు. టాస్ వేసి కూత‌కు జ‌ట్టును ఎంపిక వేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణి కూడా పాల్గొన్నారు. ఒక్కో జ‌ట్టు త‌ర‌ఫున భార్యాభ‌ర్త‌లు ఆడారు. రోజా క‌బ‌డ్డీ ఆట‌లో కూతకు వ‌చ్చిన స‌మ‌యంలో ఆమెను ఔట్ చేయ‌డానికి సెల్వ‌మ‌ణి ప్ర‌య‌త్నించారు. అనంత‌రం ఆయ‌న కూడా కూత‌కు వెళ్లినా ఆయ‌న‌ను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయ‌లేక‌పోయారు.
Roja
YSRCP
Viral Videos

More Telugu News