బాలకృష్ణ సరసన 'ఒంటరి' హీరోయిన్!
Add ap7am to your home Screen

బాలకృష్ణ సరసన 'ఒంటరి' హీరోయిన్!

Gopichand new movie update
  • 'ఒంటరి' సినిమాతో భావన పరిచయం
  • 'మహాత్మ' సినిమాతో లభించిన క్రేజ్
  • మలయాళ సినిమాలపైనే దృష్టి
  • గోపీచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్
బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేనితో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక చరిత్రకారుడి కథ ఇది. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి గోపీచంద్ మలినేని ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక కథానాయికగా శ్రుతి హాసన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'బలుపు' .. 'క్రాక్' సినిమాలతో తనకి గోపీచంద్ మలినేని హిట్లు ఇచ్చిన కారణంగా, ఈ సినిమాకి శ్రుతి హాసన్ డేట్లు ఇచ్చిందని అంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ 'సలార్' సినిమాతో ఆమె బిజీగా ఉంది. ఇక బాలకృష్ణ సినిమాలో మరో కథానాయికను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి .. ఆ కథానాయిక పేరే భావన.

ఈ కేరళ బ్యూటీ 'ఒంటరి' అనే  సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత 'హీరో' .. 'మహాత్మ' వంటి సినిమాలు చేసింది. మలయాళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం వలన, ఆమె తెలుగు సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆమెను బాలకృష్ణ సినిమా కోసం తీసుకున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది.
Balakrishna
Sruthi Haasan
Bhavana

More Telugu News