మాకు అందిన సమాచారం మేరకు హుజూరాబాద్ లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది: బండి సంజయ్
- హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
- ముగిసిన పోలింగ్
- ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకే మొగ్గు
- పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమించాయన్న బండి సంజయ్
బీజేపీ విజయం కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారందరికీ ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా నడుచుకుందని ఆరోపించారు. ఓట్లను అడ్డగోలుగా కొనేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. అయితే హుజూరాబాద్ ప్రజలు విజ్ఞత గలవారని, చైతన్యవంతంగా ఆలోచించి న్యాయం, ధర్మం వైపే మొగ్గు చూపారని పేర్కొన్నారు.