కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ!

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ!

AP Govt to give Rs 50000 for diseased families due to Corona
  • పెద్ద దిక్కును కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న ఎన్నో కుటుంబాలు
  • బాధిత కుటుంబాలకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం
  • రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లింపులు
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను కాటేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి. కుటుంబాన్ని పోషించే వ్యక్తులను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందజేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిహారం కోసం బాధిత కుటుంబాలు చేసుకునే దరఖాస్తు నమూనాను కూడా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిహారాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని సంబంధిత శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
Andhra Pradesh
Government
Corona Death families
Financial Support

More Telugu News