Vijay Sai Reddy: ఇదిగో టీడీపీ నిజస్వరూపం: గంజాయిపై గంటా వ్యాఖ్యల వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి

Vijayasai Reddy shares Ganta comments video
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గత కొన్నిరోజులుగా రాజకీయాలు గంజాయి, డ్రగ్స్ కేంద్ర బిందువుగా సాగుతున్నాయి. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఇదిగో టీడీపీ నిజస్వరూపం అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో నాటి మంత్రి గంటా ఓ మీడియా సమావేశంలో గంజాయి అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇవిగో అంటూ ట్వీట్ చేశారు.

కాగా, ఆ వీడియోలో గంటా మాట్లాడుతూ, విశాఖ నుంచే దేశమంతా గంజాయి సరఫరా అవుతోందని వెల్లడించారు. ఆ క్రెడిట్ మన నగరానికే దక్కిందంటూ చంద్రబాబు కూడా చమత్కారంగా మాట్లాడారని గంటా నవ్వులు పూయించడం ఆ వీడియోలో చూడొచ్చు.

దీనిపై విజయసాయి స్పందిస్తూ, మరి లోకేశ్ నాయకత్వంలో అయ్యన్న, వెలగపూడి, నాటి విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ల గంజాయి వ్యాపార భాగస్వామ్యం గురించి గంట మోగించారో లేక బాబు పాత్రపై అనుమానమో కానీ.... విషయం మాత్రం ఇదీ అంటూ వివరించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Ganta Srinivasa Rao
Video
Andhra Pradesh

More Telugu News