హీరో కాదు .. కంటెంట్ కావాలి: 'నాట్యం' హీరోయిన్
- ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చాను
- ఇతర భాషల్లో నటించాను
- కథ బాగుంటేనే చేస్తాను
- హీరోల వల్ల వచ్చే మైలేజ్ కోసం చూడను
ఈ సందర్భంగా సంధ్యరాజు మాట్లాడుతూ .. "చిన్నప్పటి నుంచి చాలా నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో చేశాను. కమర్షియల్ పేరుతో కథ నచ్చకపోయినా చేయలేను. ఫలానా హీరోతో చేయడం వలన మైలేజ్ ఉంటుందంటే, అలాంటి మైలేజ్ నాకు అవసరం లేదు.
ఏ సినిమాకైనా కథనే ప్రధానం .. కథ బాగుంటే చేయడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను. ఏ పాత్రను పడితే ఆ పాత్రను చేయను. 'నాట్యం' సినిమాలో నటించడం .. నిర్మించడం నాకు పెద్ద కష్టంగా అనిపించలేదు. సినిమాను పూర్తి చేసి థియేటర్ కి తీసుకురావడానికి మాత్రం చాలానే కష్టపడ్డాను" అని చెప్పుకొచ్చారు
.