తెలంగాణలో 191 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

  • జీహెచ్ఎంసీ పరిధిలో 49 కేసుల నమోదు
  • కరోనా కారణంగా ఒకరి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,968
గత 24 గంటల్లో తెలంగాణలో 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 162 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఒక పేషెంట్ చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా... కోలుకుంటున్న వారి శాతం 98.81 శాతంగా ఉంది. రాష్ట్రంలో 3,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 6,69,556 కేసులు నమోదు కాగా... 6,61,646 మంది కోలుకున్నారు. మొత్తం 3,942 మంది మృతి చెందారు.  

Telangana
Corona Virus
Updates

More Telugu News