మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల
- నిన్న అస్వస్థతకు గురైన మన్మోహన్
- ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స
- ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
- త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్న మోదీ
మరోవైపు, మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా ఎయిమ్స్‌కు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. కాగా, మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లో చేరడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.