హాయిగా బీరు తాగుతూ ఆయుధ ప్రదర్శన ఎంజాయ్ చేసిన కిమ్ జాంగ్ ఉన్... వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

హాయిగా బీరు తాగుతూ ఆయుధ ప్రదర్శన ఎంజాయ్ చేసిన కిమ్ జాంగ్ ఉన్... వీడియో ఇదిగో!

Kim Jong Un enjoys with beer and smoke at defense expo
  • ఉత్తర కొరియా ఆయుధ ప్రదర్శన
  • హాజరైన కిమ్ జాంగ్ ఉన్
  • గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా కనిపించిన కిమ్
  • ప్రదర్శన ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదన
అమెరికా పట్ల ఎన్నో సందేహాలతో ఉన్న ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆ దేశం ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనలో దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా పాల్గొన్నారు. తాజాగా, ఆయనకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది.

తమ దేశ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తుండగా, ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించడం ఆ వీడియోలో కనిపించింది. అంతేకాదు, తన సైనిక జనరళ్లతో కలిసి హాయిగా బీరు తాగుతూ, చేతిలో సిగరెట్ తో సేదదీరుతున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా కిమ్ ఉన్నట్టు తాజా ఫుటేజి వెల్లడిస్తోంది.
Kim Jong Un
Beer
Cigarete
Defense Expo
North Korea

More Telugu News