Telangana: తెలంగాణలో మరో 183 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,354 కరోనా పరీక్షలు నిర్వహించగా, 183 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 20, ఖమ్మం జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,68,070 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,942 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,196 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,932కి పెరిగింది.
Telangana
Corona Virus
Media Report
Today Cases

More Telugu News