విద్యుత్ చార్జీలపై సీఎం జగన్ కు నారా లోకేశ్ బహిరంగ లేఖ
- రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల మోత
- స్పందించిన లోకేశ్
- ట్రూఅప్ చార్జీల ఉపసంహరణకు డిమాండ్
- ఆరుసార్లు కరెంటు చార్జీలు పెంచారంటూ ఆగ్రహం
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.20,261 కోట్ల అప్పులు చేశారని, ఆ భారాన్ని ట్రూఅప్ చార్జీల పేరుతో లాగేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. యూనిట్ గరిష్ఠంగా రూ.20కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటూ లోకేశ్ ప్రశ్నించారు. యూనిట్ కు అదనంగా చెల్లిస్తున్న రూ.10 ఎవరి జేబులోకి వెళుతోందని నిలదీశారు.