vanita vijay kumar: స‌మంత త‌న బ‌తుకు తాను బ‌త‌కాలి: సినీ నటి వనితా విజయ్ కుమార్

టాలీవుడ్ జంట స‌మంత‌, నాగ చైత‌న్య విడిపోయిన నేప‌థ్యంలో ఈ విషయంపై ప‌లువురు సినీన‌టులు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా, నటి వనితా విజయ్ కుమార్ స్పందిస్తూ  కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సమంతకు తాను మద్దతు తెలుపుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

సమాజం అనేది అవాస్తవమ‌ని, దాన్ని స‌మంత‌ పట్టించుకోవాల్సిన అవ‌సరం లేదని వ‌నితా విజ‌య్ కుమార్ తెలిపింది. స‌మంత త‌న బ‌తుకు తాను బ‌త‌కాల‌ని, జీవితం అనేది చాలా విలువైంద‌ని వ‌నిత హిత‌వు ప‌లికింది. జరిగే ప్రతి విషయం వెనుక ఓ కారణం ఉంటుందని, స‌మంత ధైర్యంగా ముందుకెళ్లాల‌ని ఆమె పేర్కొంది. ఆమెకు మరింత బలం చేకూరాలని కోరుకుంటున్న‌ట్లు చెప్పింది.
vanita vijay kumar
Samantha
naga chaitanya
Tollywood

More Telugu News