Jeevitha: జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పిన జీవిత

Jeevitha says sorry to Junior NTR
షార్ట్స్‌లో చూడండి
'మా' ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీల ప్రచారాన్ని తలపిస్తోంది. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్స్ కు చెందిన సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ... తారక్ ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పారు.

మరోవైపు మంచు విష్ణు ఓ ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ, తారక్ తనకే ఓటు వేస్తానని చెప్పాడని అన్నారు. దీంతో, జీవిత స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పారు. ఎన్టీఆర్ నిరాసక్తత గురించి తాను చెప్పిన విషయం 'మా' సభ్యులను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. క్యాజువల్ గా ఎన్టీఆర్ అన్న మాటను తాను మీడియా ముందు ఉంచడం సమస్యగా మారిందని చెప్పారు.
Go Back to Shorts
Jeevitha
Junior NTR
Manchu Vishnu
Tollywood
MAA

More Telugu News