'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 25వ సినిమా ఖరారు .. పోస్టర్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 25వ సినిమా ఖరారు .. పోస్టర్ రిలీజ్!

Prabhas 25th movie update
  • షూటింగు దశలో 'సలార్'
  • సెట్స్ పైనే ఉన్న 'ఆది పురుష్'
  • గ్రౌండ్ వర్క్ చేస్తున్న నాగ్ అశ్విన్
  • ఆ తరువాత ప్రాజెక్టును లైన్లో పెట్టిన ప్రభాస్
సందీప్ రెడ్డి వంగా .. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఈ పేరు పాప్యులర్ అయిపోయింది. ఈ సినిమాతో స్టార్ హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ చేరిపోతే, స్టార్ డైరెక్టర్ల జాబితాలో సందీప్ రెడ్డి చేరిపోయాడు. ఆ తరువాత ఎంతోమంది టాలీవుడ్ హీరోలు ఆయనతో కలిసి పనిచేయడానికి ఉత్సాహాన్ని చూపించారు.

కానీ ఆయన మాత్రం 'అర్జున్ రెడ్డి' కథను బాలీవుడ్ కి తీసుకెళ్లి అక్కడ కూడా హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన ప్రభాస్ తో చేయనున్నాడనేది కొంత సేపటి క్రితం వదిలిన పోస్టర్ ద్వారా స్పష్టమైపోయింది. 'స్పిరిట్' టైటిల్ తో రూపొందనున్న ఈ పాన్ ఇండియా సినిమాకి, భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

కెరియర్ పరంగా ప్రభాస్ కి ఇది 25వ సినిమా. ప్రభాస్ తన 25వ సినిమాను రాజమౌళితో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వచ్చారు. లేదంటే సందీప్ రెడ్డి వంగాతో గానీ .. సిద్ధార్ ఆనంద్ తో గాని చేయవచ్చని చెప్పుకున్నారు. చివరికి సందీప్ రెడ్డి వంగాతో సెట్ అయిందన్న మాట. 'సలార్' .. 'ఆది పురుష్'తో పాటు, నాగ్ అశ్విన్ సినిమా కూడా పూర్తయిన తరువాత, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
Prabhas
Sandeep Reddy Vanga
Spirit Movie

More Telugu News